కత్తితో కేక్ కట్ చేసిన దర్శకుడు వెట్రిమారన్ పై విమర్శలు

రిపోర్టర్: సతీష్ స్థలం: తమిళనాడు

ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ తన పుట్టినరోజు వేడుకల్లో కత్తితో కేక్ కట్ చేయడం వివాదాస్పదమైంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఇలాంటి చర్యలకు పాల్పడటం యువతకు తప్పుడు సంకేతాలు పంపుతుందని, దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన ప్రస్తుతం తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.