విజయనగరంలో ఇంటర్నేషనల్ జిమ్ ప్రారంభం: ఘనంగా రా ఫిట్నెస్ సెంటర్ ఏర్పాటు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: విజయనగరం
విజయనగరం ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో 'రా ఫిట్నెస్' కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వహకులు బండారు జగదీష్ తెలిపారు. అక్టోబర్ 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు మాజీ జెడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), సిరి సహస్ర, ప్రదీప్ నాయుడు ముఖ్య అతిథులుగా ఈ సెంటర్ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అధునాతన పరికరాలు, నిపుణులైన ట్రైనర్లతో శిక్షణ అందిస్తామన్నారు. ప్రజలందరూ ప్రారంభోత్సవానికి విచ్చేసి రోజువారీ వ్యాయామంతో ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని కోరారు.