తెదేపాలో విభేదాల కలకలం: ఎమ్మెల్యే కొలికపూడి, పోతుల బాలకోటయ్యలపై అగ్రనాయకత్వం ఆగ్రహం
రిపోర్టర్: అశోక్
స్థలం: Amaravati
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ పోతుల బాలకోటయ్య పరస్పర ఆరోపణలపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఇద్దరి మధ్య విభేదాలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని, వర్గాల మధ్య వివాదంగా మార్చొద్దని హెచ్చరించినట్లు ఆయన పేర్కొన్నారు. అంతర్గత వ్యవహారాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఇద్దరు నేతలకు స్పష్టం చేసినట్లు వివరించారు.