ఓటర్ల జాబితాలో భారీ అక్రమాలు: ఎస్ఐఆర్ ప్రక్రియపై వోటర్ రైట్స్ ఫోరం ఫైర్
రిపోర్టర్: గోపి
స్థలం: Hyderabad
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భారీగా అక్రమ తొలగింపులు జరిగాయని తెలంగాణ వోటర్ రైట్స్ ఫోరం ఆరోపించింది. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఫోరం ప్రతినిధి డాక్టర్ ఎ. సునీత మాట్లాడుతూ, ముషీరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్ లో వందలాది మంది ఓట్లు అన్యాయంగా తొలగించబడ్డాయని మండిపడ్డారు. ఈ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని, లేదంటే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని తీవ్రంగా హెచ్చరించారు.