'సముద్రం అలజడిగా ఉంటుంది.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు': వాతావరణ శాఖ హెచ్చరిక

రిపోర్టర్: వెంకట్ స్థలం: తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలతో పాటు ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు పడతాయని, సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు.