ఓట్ల చోరీపై సీఈసీ రాజీనామాకు డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ధర్నా

రిపోర్టర్: P.srinu స్థలం: భువనగిరి

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మహా ధర్నా నిర్వహించారు. ఓట్ల చోరీ వ్యవహారంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వైఖరిని ఎండగడుతూ, ఆయన వెంటనే పదవికి రాజీనామా చేయాలని టీపీసీసీ పిలుపు మేరకు నాయకులు డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డిలతో పాటు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు.