రోజా మార్ఫింగ్ వీడియోపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నగరి పార్టీ శ్రేణులు
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: నగరి
చిత్తూరు జిల్లా నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజాకు సంబంధించిన వీడియోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా నాయకురాలిని అసభ్యంగా చిత్రీకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నగరి సీఐకి బాధితులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.