ఇరాన్ లోని ఖేష్మ్ ద్వీపంలో భారీ పేలుళ్లు కలకలం!
రిపోర్టర్: శివ
స్థలం: World
ఇరాన్ లోని వ్యూహాత్మక ఖేష్మ్ ద్వీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. సముద్ర తీర ప్రాంతం నుండి రెండు పెద్ద శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. అమెరికాతో ఉద్రిక్తతల నడుమ హార్ముజ్ జలసంధి సమీపంలో ఈ పేలుళ్లు జరగడం తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లినట్లు ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి సమాచారం వెలువడలేదు.