నిరుద్యోగులకు గుడ్ న్యూస్: బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఆన్సర్ కీ విడుదల
రిపోర్టర్: గోపి
స్థలం: New Delhi
బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షకు సంబంధించిన తాత్కాలిక ఆన్సర్ కీని విడుదల చేసినట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. నవంబర్ రెండున నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా తమ రెస్పాన్స్ షీట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. తప్పులపై అభ్యంతరాలను నవంబర్ ఆరు లోగా తెలపాలని స్పష్టం చేశారు.