చింతపల్లిలో భారీ వర్షాలకు కూలిన మట్టి ఇల్లు
రిపోర్టర్: G Satyam🌹
స్థలం: చింతపల్లి
అల్లూరి జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయతీ జోహార్ గ్రామంలో నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాంగి సియారి మట్టి ఇల్లు పూర్తిగా కూలిపోయింది. ఇల్లు కూలడంతో ఇంట్లోని ధాన్యం, ఇతర వస్తువులు నీటిలో తడిసిపోయాయి. ఎటుపోవాలో తెలియక నిరాశ్రయులైన ఆ నిరుపేద గిరిజన కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.