టీచర్లకు గౌరవం దక్కాలి, రాజకీయాలకు దూరంగా ఉండాలి: చంద్రబాబు
రిపోర్టర్: రమేష్
స్థలం: విజయవాడ
విజయవాడలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. టీచర్లు రాజకీయ నేతల చుట్టూ తిరగకుండా గౌరవంగా జీవించాలని సూచించారు. రాష్ట్ర భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని, విద్యార్థులకు ఆధునిక కోర్సులను బోధించాలని కోరారు. త్వరలో టీచర్లకు సహాయంగా ఏఐ (AI) టీచర్లను అందుబాటులోకి తెస్తామని, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.