ఆసియా క్రీడల్లో అపశృతి దక్షిణ కొరియాకు బదులుగా ఉత్తర కొరియా జాతీయ గీతం మోత
రిపోర్టర్: కృష్ణ
స్థలం: వరల్డ్
ఆసియా క్రీడల్లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన పురుషుల హాకీ మ్యాచ్ ప్రారంభానికి ముందు దక్షిణ కొరియా జాతీయ గీతానికి బదులుగా పొరపాటున ఉత్తర కొరియా జాతీయ గీతాన్ని నిర్వాహకులు ప్లే చేశారు. దీంతో దక్షిణ కొరియా క్రీడాకారులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. ఈ పొరపాటును ఆలస్యంగా గ్రహించిన నిర్వాహకులు క్షమాపణలు చెప్పి, అసలు గీతాన్ని ప్లే చేసినప్పటికీ, అప్పటికే మ్యాచ్ సమయం ఆసన్నమవడంతో క్రీడాకారులు తమ జాతీయ గీతాన్ని ఆలపించకుండానే మ్యాచ్ ప్రారంభించాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో దక్షిణ కొరియా జట్టు ఐదు సున్నా తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది.