రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థి తేజ

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా కరాటే పోటీల్లో కాసిపేట మోడల్ స్కూల్ ఆరో తరగతి విద్యార్థి కటకం తేజ సత్తాచాటాడు. బెల్లంపల్లి మండలం సోమగూడెంలోని త్రినేత్రి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన 6వ రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్షిప్లో తేజ ప్రతిభ కనబరిచి విజయం సాధించాడు. గంగారాం నగర్కు చెందిన శ్రీనివాస్, మౌనిక దంపతుల కుమారుడైన తేజ విజయం సాధించడం పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.