రుషికొండ భవనాల వినియోగంపై త్వరలోనే స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామన్న చంద్రబాబు

రిపోర్టర్: సునీల్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నంలోని రుషికొండలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన భవనాలను ప్రజలకు ఉపయోగపడేలా ఏ విధంగా వినియోగించాలనే అంశంపై త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విశాఖ పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ, భారీ వ్యయంతో నిర్మించిన ఈ కాంప్లెక్స్‌ను ఖాళీగా ఉంచడం వల్ల నిర్వహణ భారం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. నగర అభివృద్ధి, పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాల తరలింపు వంటి పలు కీలక అంశాలపై కూడా ఆయన సమీక్షించారు.