మండాడి సినిమా విజయంపై నటుడు కమల్ హాసన్ ప్రత్యేక అభినందనలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: Chennai
ప్రముఖ నటుడు సూరి హీరోగా మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో తెరకెక్కిన మండాడి చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 109.25 కోట్ల వసూళ్లను సాధించి ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో సినిమాను ప్రత్యేకంగా వీక్షించిన లెజెండరీ నటుడు కమల్ హాసన్ చిత్ర బృందాన్ని అభినందించారు. కమల్ హాసన్‌ను కలవడం తన జీవితంలో మరువలేని క్షణమని హీరో సూరితో పాటు నటుడు సుహాస్, దర్శకుడు తమ ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.