ఇట్లు అర్జున చిత్రంపై నిర్మాత వెంకీ కుడుముల కీలక విశేషాలు వెల్లడి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: హైదరాబాద్

అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున సమర్పణలో తెరకెక్కిన ఇట్లు అర్జున చిత్రంలో హీరో మూగ పాత్రలో కనిపిస్తారని, కొత్త నటుడు అనీష్ అద్భుతంగా నటించారని నిర్మాత వెంకీ కుడుముల తెలిపారు. ఈ నెల 13న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దర్శకుడు మహేశ్ ఉప్పల చెప్పిన కథ నచ్చడంతోనే ఈ సినిమాను నిర్మించినట్లు వెల్లడించారు.