సిద్ధిపేటపై యుద్ధానికి వచ్చినట్లు కాంగ్రెస్ దండయాత్ర
రిపోర్టర్: గోపి
స్థలం: Siddipet
సిద్ధిపేటలో మూడు వేల మంది పోలీసులతో కాంగ్రెస్ ప్రభుత్వం దండయాత్ర చేసిందని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ఎమ్మెల్సీలు, ఎంపీలు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, డ్రోన్లు, కెమెరాలతో యుద్ధానికి వచ్చినట్లు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాధనాన్ని ఈ విధంగా వృథా చేయడం సరికాదని, అధికారంలో ఉన్నవాళ్లు ఇలాంటి చర్యలకు పాల్పడటం ఏంటని ఆయన తీవ్రస్థాయిలో నిలదీశారు.