శింగనమల నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: శ్రీ సత్యసాయి

శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ మరియు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుల ఆహ్వానం మేరకు శింగనమల నియోజకవర్గం పరిధిలోని అలంకారాయునిపేట గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్నట్లు పరిటాల శ్రీరామ్ - ధర్మవరం టీడీపీ సమన్వయకర్త వెల్లడించారు. ఈ పర్యటనలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘన స్వాగతం పలికారన్నారు. నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు, గ్రామాల సర్వతోముఖ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని ఈ సందర్భంగా తెలిపారు.