గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ కీలక ప్రకటన: విద్యార్థులకు మరో అవకాశం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: New Delhi

నిర్ణీత కాలపరిమితిలో డిగ్రీ పూర్తి చేయని విద్యార్థులకు గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ మరో అవకాశం కల్పించింది. ఈ మేరకు నవంబర్ ఆరు లోపు దరఖాస్తులు సమర్పించాలని అధికారులు తెలిపారు. ఆఫ్లైన్ విధానంలో నిర్వహించనున్న ఈ పరీక్షల కోసం విద్యార్థులు ఇరవై ఐదు వేల రూపాయల కంటిన్యూయేషన్ ఫీజుతో పాటు ఒక్కో సబ్జెక్టుకు వెయ్యి రెండు వందల రూపాయల రుసుము చెల్లించాలని అధికారులు వెల్లడించారు.