మహిళల భద్రతకే కాంగ్రెస్ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత: మంత్రి పొన్నం ప్రభాకర్
రిపోర్టర్: రాజేష్
స్థలం: సిద్దిపేట
మహిళల భద్రత మరియు సాధికారతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పొన్నం ప్రభాకర్ - మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే వెల్లడించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని తెలిపారు. మహిళలు భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో ప్రయాణించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రతపై నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేస్తూ ప్రజలకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని తెలిపారు.