ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి క్యాడర్ వివాదం: తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
సీనియర్ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి క్యాడర్ కేటాయింపు వివాదానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో విచారణ ముగిసినట్లు న్యాయస్థానం వర్గాలు వెల్లడించాయి. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తుది తీర్పును రిజర్వ్లో ఉంచింది. ఉమ్మడి రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్రం ఆమెను ఏపీకి కేటాయించగా, దానిని సవాలు చేస్తూ ఆమె క్యాట్ను ఆశ్రయించారు. క్యాట్ తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై త్వరలోనే స్పష్టత రానుంది.