సింహాచలం కొండలపై కూటమి ప్రభుత్వ పర్యావరణ విధ్వంసం బట్టబయలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: Visakhapatnam

విశాఖపట్నంలో కురిసిన భారీ వర్షాలకు సింహాచలం కొండలపై జరుగుతున్న పర్యావరణ విధ్వంసం బట్టబయలైంది. డేటా సెంటర్ పేరుతో వేలాది చెట్లను నరికివేస్తున్న కూటమి ప్రభుత్వం, ప్రజల కళ్లలో మట్టి కొట్టేందుకు ప్రహరీ గోడకు పరదాలు, రేకులు కట్టింది. అయితే తాజాగా పడిన భారీ వర్షాలకు ఇవి కూలిపోవడంతో ప్రభుత్వ అరాచకాలు బయటపడ్డాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.