అల్లూరి జిల్లాలో ముంచింగిపుట్టు పోలీసుల ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు

రిపోర్టర్: సురేష్ స్థలం: అల్లూరి సీతారామరాజు

అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పలు కీలక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు Alluri Police వెల్లడించారు. మహిళా భద్రత, రోడ్డు భద్రత, సైబర్ నేరాల నియంత్రణ మరియు మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమాజంలో నేరాలను అరికట్టడంతో పాటు యువతను సరైన మార్గంలో నడిపించేందుకు ఈ అవగాహన సదస్సులు ఎంతగానో దోహదపడతాయని పేర్కొంటూ పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి.