ప్రజా రవాణా కష్టాలకు స్వస్తి పలుకుతూ శరవేగంగా రహదారి విస్తరణ పనులు
రిపోర్టర్: saikiran
స్థలం: చందానగర్
చందానగర్ డివిజన్ పరిధిలోని NH-65 శ్రీదేవి థియేటర్ నుండి అమీన్పూర్ వరకు చేపడుతున్న రహదారి విస్తరణ పనులను పీఏసీ ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. సుమారు రూ. 45 కోట్ల భారీ వ్యయంతో 2.7 కిలోమీటర్ల పరిధిలో 4-లేన్ రోడ్డుతో పాటు 2-లేన్ సర్వీస్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు, జీహెచ్ఎంసీ కమిషనర్ సృజన, జోనల్ కమిషనర్ అమిత్ నారాయణ్, డీసీ శ్రీనివాస్, రఘునాథ్ రెడ్డి తదితర ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.