రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

తెలంగాణలో విద్యుత్ వ్యవస్థ నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, యాదాద్రి పవర్ ప్లాంట్‌లో పూర్తి సామర్థ్యం మేరకు విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదని, బొగ్గు నాణ్యతా లోపంతో పాటు కొత్తగూడెం, భద్రాద్రిలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి చేతకానితనం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.