వరంగల్ నుంచి కరీంనగర్ కేవలం నలభై నిమిషాల్లోనే ప్రయాణం

రిపోర్టర్: వెంకట్ స్థలం: వరంగల్

వరంగల్ మరియు కరీంనగర్ నగరాల మధ్య జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఎన్‌హెచ్ 563 నూతన నాలుగు లైన్ల రహదారి పనులు పూర్తిగా ముగిశాయి. ఈ మార్గం అందుబాటులోకి రావడంతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గి, కేవలం నలభై నిమిషాల్లోనే రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే వెసులుబాటు కలిగింది.