అన్నమయ్య మరియు చిత్తూరు జిల్లాలలో బర్డ్ ఫ్లూ రహిత ప్రాంతాలుగా ప్రకటన
రిపోర్టర్: నరేష్
స్థలం: అమరావతి
అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలను బర్డ్ ఫ్లూ రహితంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకడంతో నిషేధాలు విధించారు. భోపాల్‌లోని ఐకార్ ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఏడీకి నమూనాలు పంపి పరీక్షలు చేయించగా వరుసగా నెగెటివ్ రావడంతో ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.