అమ్రాబాద్లో దారుణం.. యజమానిని హతమార్చి సంచిలో దాచిన కుటుంబం

రిపోర్టర్: dumarla bhaskar senier journalist స్థలం: అమ్రాబాద్

అమ్రాబాద్ మండల కేంద్రంలో బురాన్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. మొబైల్ షాప్ యజమాని అయిన బురాన్ను, ఆయన భార్య మరియు ఇద్దరు కుమారులు మూడు రోజుల క్రితమే హతమార్చి, మృతదేహాన్ని గోనెసంచిలో మూటగట్టి దాచిపెట్టారు.

దుర్వాసన రాకుండా నిందితులు మృతదేహంపై పౌడర్ చల్లినట్లు తెలుస్తోంది. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. నిందితులు పరారీలో ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.