నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
రిపోర్టర్: వెంకట్
స్థలం: India
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ముగిశాయి. గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న నిఫ్టీ వరుస లాభాలకు బ్రేక్ పడింది. ఐటీ, ఫైనాన్షియల్ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరగడం, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్ సెంటిమెంట్ బలహీనపడింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 329.91 పాయింట్లు నష్టపోయి 74,529.08 వద్ద స్థిరపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 85.30 పాయింట్లు క్షీణించి 23,329.00 వద్ద ముగిసింది.