అమెరికాలో పద్దెనిమిది బిలియన్ డాలర్ల పెట్టుబడికి సిద్ధమైన ఎస్సార్ గ్రూప్

రిపోర్టర్: కృష్ణ స్థలం: అమెరికా

అమెరికాలో ఏకంగా పద్దెనిమిది బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడికి భారతీయ ప్రముఖ కంపెనీ ఎస్సార్ గ్రూప్ సిద్ధమైందని వైట్ హౌస్ ప్రత్యేక కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో భాగంగా అయోవా రాష్ట్రంలో పదిహేను బిలియన్ డాలర్ల వ్యయంతో మెసాబి మెటాలిక్స్ ఆధ్వర్యంలో సరికొత్త ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మెసాబి మెటాలిక్స్ ఛైర్మన్ రేవంత్ రూయా వెల్లడించారు. రెండు వేల ముప్పై నాటికి ఈ ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభం కానుంది.