ముంబై ఆటో డ్రైవర్ కొడుకుకు కేజీఎంయూలో ఎంబీబీఎస్ సీటు
రిపోర్టర్: హరి
స్థలం: ఉత్తరప్రదేశ్
ఉత్తరప్రదేశ్ లోని జౌన్ పూర్ జిల్లా మచ్ లీషహర్ తహసీల్ పరిధిలోని దేవాకీపూర్ గ్రామానికి చెందిన ప్రభాత్ కుమార్ యాదవ్ నీట్ యూజీ 2026 పరీక్షలో 627 మార్కులు సాధించి లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ సీటు సాధించారు. ప్రభాత్ తండ్రి మహేంద్ర కుమార్ యాదవ్ ముంబైలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తండ్రి కష్టాన్ని వృథా కానివ్వకుండా పట్టుదలతో చదివి వైద్య విద్య సీటు సాధించిన ప్రభాత్ విజయంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.