షాకింగ్ ఘటన: రామాయణ షూటింగ్ సెట్లో అకస్మాత్తుగా చెలరేగిన భారీ మంటలు

రిపోర్టర్: సురేష్ స్థలం: ముంబై

బాలీవుడ్ తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక రామాయణ చిత్ర షూటింగ్ సెట్లో ఊహించని అగ్నిప్రమాదం సంభవించిందని ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ అధ్యక్షుడు బి.ఎన్. తివారీ తెలిపారు. ముంబైలోని ప్రముఖ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ ప్రాంగణంలో తాత్కాలిక టెంట్లలో మంటలు చెలరేగడంతో సిబ్బంది ఉలిక్కిపడ్డారు. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని, ప్రాణనష్టం తప్పిందని ఆయన స్పష్టం చేశారు.