అనంతపురం జిల్లాలో వర్షాభావంతో దెబ్బతిన్న మిరప పంట: ఆవేదనలో రైతులు
రిపోర్టర్: విజయ్
స్థలం: అనంతపురం
అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పొలికి గ్రామంలో వర్షాలు కురవక మిరప పంట పూర్తిగా దెబ్బతిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో వర్షాలు పడకపోవడంతో మొక్కలు వాడిపోయాయని, దీంతో కూలీలను పెట్టి పంటను పూర్తిగా తొలగించామని బాధితులు వాపోయారు. పది ఎకరాల్లో ఆరు లక్షల పెట్టుబడితో సాగు చేసిన పంట చేతికి రాకుండా పోయిందని బసన్న, గోవిందు అనే రైతులు తెలిపారు. ప్రభుత్వం స్పందించి తమను ఆర్థికంగా ఆదుకోవాలని వారు కోరారు.