రేణికుంట గ్రామంలో శరన్నవరాత్రి సందర్భంగా వైభవంగా చండీ హోమం
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండలంలోని రేణికుంట గ్రామంలో భవాని సేన ఆధ్వర్యంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు మహిషాసుర మర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారి సన్నిధిలో వేద పండితులు చలివేదుల రాజేశ్వర్ శర్మ నేతృత్వంలో వైభవంగా చండీ హోమం నిర్వహించారు. ఈ వేడుకల్లో పలువురు దంపతులు, భవాని సేన కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు సమర్పించారు.