భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న బండి సంజయ్
రిపోర్టర్: సునీల్
స్థలం: భద్రాద్రి కొత్తగూడెం
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బుధవారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బండి సంజయ్, వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.