దానం నాగేందర్ అనర్హత తీర్పును స్వాగతించిన బీజేపీ నేతలు

రిపోర్టర్: రమేష్ స్థలం: తెలంగాణ

బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేస్తూ ఇచ్చిన తీర్పును భారతీయ జనతా పార్టీ పూర్తిగా స్వాగతించింది. మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కు అనుకూలంగా, స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టి హైకోర్టు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పు రాజ్యాంగ విరుద్ధ ఫిరాయింపులకు గట్టి చెంపపెట్టు అని బీజేపీ నేతలు స్పష్టం చేశారు.