పశ్చిమాసియా ఘర్షణల్లో ఇరవై ఇద్దరు భారతీయులు మృతి: విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడి

రిపోర్టర్: మహేష్ స్థలం: New Delhi

పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటివరకు ఇరవై ఇద్దరు భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయారని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ బుధవారం వెల్లడించారు. దౌత్య కార్యాలయాలు అక్కడి పౌరులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని ఆయన తెలిపారు. భద్రతా పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని పేర్కొన్నారు. సౌదీ అరేబియాలో జరిగిన వేర్వేరు ఘటనల్లో ముగ్గురు భారతీయ జాతీయులు మరణించినట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం జెడ్డాలోని భారత రాయబార కార్యాలయం కొత్త ప్రయాణ మార్గదర్శకాలను జారీ చేసింది.