శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఘనంగా సర్టిఫికెట్ల ప్రదానం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: అరకు వ్యాలీ
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ మండలం కుర్రాయి కొత్తవలస గ్రామంలో గురుదేవ చారి ట్రస్ట్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన బీసీవై పార్టీ జిల్లా ఇన్చార్జ్ కే. రాజన్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన మహిళలు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ ఈ ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి వేలాది మందికి ఉపాధి శిక్షణ అందించాలని ఆయన ఆకాంక్షించారు.