దుబాయ్ ప్రయాణికులకు అలర్ట్: లగేజీ నిబంధనలు పాటించకుంటే భారీ షాక్

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

భారత్ నుంచి దుబాయ్ లేదా యూఏఈ దేశాలకు ప్రయాణించే వారు లగేజీ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. విమాన ప్రయాణంలో ఆహార పదార్థాలు, మందుల రవాణాపై భద్రతా విభాగాలు కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఎండు కొబ్బరి, గసగసాలతో పాటు పలు వస్తువులు పూర్తిగా నిషేధమని అధికారులు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎయిర్పోర్ట్లో చిక్కులు తప్పవని ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేశారు.