బంజారాహిల్స్ నుంచి శిల్పా లేఅవుట్ వరకు ఎలివేటెడ్ కారిడార్ టెండర్లు

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు బంజారాహిల్స్ నుంచి గచ్చిబౌలి శిల్పా లేఅవుట్ వరకు రూ.1656 కోట్ల అంచనా వ్యయంతో భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి హెచ్‌ఎండీఏ టెండర్లు పిలిచింది. 9 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న ఈ సిగ్నల్ ఫ్రీ కారిడార్‌తో ఐటీ కారిడార్ ప్రయాణికులకు ట్రాఫిక్ బాధలు తొలగిపోనున్నాయి.