పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ: రాష్ట్రంలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: నెల్లూరు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న సుపరిపాలనలో ఇళ్ల పట్టాల పంపిణీ ఉద్యమంలా సాగుతోందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి కట్ట వద్ద 939 పేద కుటుంబాలకు సుమారు రూ.600 కోట్ల విలువైన శాశ్వత ఇళ్ల పట్టాల పంపిణీని ఆయన వర్చువల్ ద్వారా ప్రారంభించారు. స్థానిక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ రాబోతుందని సీఎం తెలిపారు.