సూర్యాపేట హైవేపై అస్వస్థతకు గురైన వృద్ధుడు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: మధిర
సూర్యాపేట జాతీయ రహదారిపై అపస్మారక స్థితిలో పడి ఉన్న మధిర వాసి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. సుమారు అరవై సంవత్సరాల వయసున్న ఆ వ్యక్తి కోదాడ వెళ్లాల్సి ఉందని స్థానికులకు తెలిపారు. డీ మార్ట్ సమీపంలో అస్వస్థతకు గురైనట్లు గుర్తించిన 108 సిబ్బంది వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.