యూపీలో బీజేపీ లక్ష్యం: 2027 ఎన్నికల్లో మూడు వందల సీట్లు సాధించాలంటూ అమిత్ షా పిలుపు

రిపోర్టర్: కిరణ్ స్థలం: లక్నో

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మూడు వందల ఇరవై ఐదు నుంచి మూడు వందల యాభై సీట్లు సాధించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చినట్లు రాష్ట్ర బీజేపీ వర్గాలు వెల్లడించాయి. లక్నోలో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని దిశానిర్దేశం చేశారు. మూడోసారి కూడా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో కష్టపడాలని ఆయన శ్రేణులకు స్పష్టం చేసినట్లు నేతలు తెలిపారు.