గుంటూరు జీజీహెచ్లో అమానుషం: మార్చురీ వద్ద వదిలేయడంతో రోగి మృతి
రిపోర్టర్: సురేష్
స్థలం: గుంటూరు
గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. నడవలేని స్థితిలో ఉన్న అనాథ రోగిని భద్రతా సిబ్బంది నిర్దాక్షిణ్యంగా మార్చురీ గోడపక్కన వదిలేశారు. తీవ్ర ఎండలో గంటల తరబడి నరకయాతన అనుభవించిన ఆ అభాగ్యుడు సోమవారం మృతి చెందాడు. ఈ ఘటనపై ఆసుపత్రి సీఎస్ఆర్ఎంవో బి.వి.రావు స్పందిస్తూ పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామని తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.