రాష్ట్రంలో వైద్యరంగం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని కవిత ఆగ్రహం

రిపోర్టర్: కిరణ్ స్థలం: Telangana

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తెలంగాణలో ప్రభుత్వ వైద్యరంగం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. మానవ ప్రాణాల పట్ల ప్రభుత్వానికి కనీస స్పందన లేదని, గత రెండు సంవత్సరాల్లో జరిగిన శిశు మరణాలే ఇందుకు నిదర్శనమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాల వల్ల ప్రజల ప్రాణాలు గాలికీ కలిసిపోతున్నాయని ఘాటుగా మండిపడ్డారు.