పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజంకు అసలు అధికారాలు ఉన్నాయా?

రిపోర్టర్: సురేష్ స్థలం: World

ఇంగ్లాండ్‌తో సిరీస్ మధ్యలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఏడుగురు ఆటగాళ్లను తొలగించడంపై మైఖేల్ అథర్టన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బోర్డు జోక్యంతో కెప్టెన్ బాబర్ ఆజంకు జట్టుపై పట్టు కోల్పోయే ప్రమాదం ఉందని, అతడిని 'డమ్మీ కెప్టెన్'గా అభివర్ణించారు. ఇలాంటి నిర్ణయాలు దీర్ఘకాలంలో జట్టుకు నష్టం కలిగిస్తాయని, కెప్టెన్‌కు కనీస అధికారం లేని జట్టును నడపడం అసాధ్యమని అథర్టన్ విమర్శించారు.