రామాయణ చిత్రంలో రణ్‌బీర్ కపూర్‌కు మద్దతుగా నిలిచిన నటుడు రవి దూబే
రిపోర్టర్: వెంకట్
స్థలం: భారతదేశం
నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పౌరాణిక చిత్రం రామాయణంలో రాముడి పాత్ర పోషిస్తున్న రణ్‌బీర్ కపూర్ ఎంపికపై వస్తున్న విమర్శలను లక్ష్మణుడి పాత్రధారి రవి దూబే తీవ్రంగా ఖండించారు. రణ్‌బీర్ మన దేశంలోనే అత్యుత్తమ నటుడని, ఆయన అంకితభావం, పని పట్ల నిబద్ధత సాటిలేనివని ప్రశంసించారు. సెట్స్‌లో ఆయన చూపించే తీవ్రత, వినయపూర్వక ప్రవర్తన తనకు ఎంతగానో స్ఫూర్తినిచ్చాయని రవి దూబే వెల్లడించారు.