ప్రజల సమస్యలను లోతుగా తెలుసుకునేందుకు వచ్చానన్న ప్రియాంక గాంధీ
రిపోర్టర్: గోపి
స్థలం: Wayanad
కేరళలోని వాయనాడ్ లో పర్యటిస్తున్న కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ జాముయ్ వేధింపుల ఘటనపై స్పందించారు. ఈ పర్యటనలో వీలైనంత ఎక్కువ మందిని కలిసి వారి సమస్యలను లోతుగా తెలుసుకుంటానని తెలిపారు. ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన తెచ్చుకుని తగిన చర్యలు తీసుకునేందుకు ఈ సుదీర్ఘ పర్యటన ఎంతగానో దోహదపడుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.