హైదరాబాద్లో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన తేదీ ఖరారు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన తేదీ ఖరారైంది. ఈ ఏడాది సెప్టెంబర్ 25న అనంత చతుర్దశి పర్వదినం సందర్భంగా హుస్సేన్ సాగర్లో గణనాథుడిని నిమజ్జనం చేయనున్నట్లు ఉత్సవ కమిటీ ప్రకటించింది. ఈసారి ఉత్సవాలను 12 రోజుల పాటు నిర్వహిస్తుండటంతో భక్తులకు మహాగణపతిని దర్శించుకునేందుకు అదనంగా మరో రోజు అవకాశం లభించింది. నిమజ్జన ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.