తప్పులు లేని భూరికార్డులే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న సోమిరెడ్డి
రిపోర్టర్: sujith reddy
స్థలం: తోటపల్లిగూడూరు
తప్పులు లేని భూరికార్డులందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తోటపల్లిగూడూరులో 741 మంది రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. గత వైసీపీ హయాంలో రికార్డుల్లో జరిగిన తప్పులను, అవినీతిని సరిదిద్దుతూ పారదర్శక పాలన అందిస్తున్నామని ఆయన తెలిపారు.